Vellampalli Srinivasa Rao: 40 దేవాలయాలను కూల్చిన చరిత్ర చంద్రబాబుది!: ఏపీ మంత్రి వెల్లంపల్లి విమర్శలు

Chandrababu intentionally politicising Antarvedi incident says Vellampalli
  • చంద్రబాబు వంటి నీచమైన రాజకీయ నాయకుడు మరొకరు లేరు
  • బాబు చేసిన తప్పులకు నరకం కూడా చిన్నదే
  • అంతర్వేది ఘటనను కావాలనే రాజకీయం చేస్తున్నారు
చంద్రబాబు నాయుడు వంటి నీచమైన రాజకీయ నాయకుడు మరొకరు లేరని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని పీడిస్తున్న రాక్షసుడు చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబు చేసిన తప్పులకు నరకం కూడా చిన్నదేనని అన్నారు. ఎన్ని గుళ్లకు తిరిగినా ఆయన చేసిన పాపాలకు పరిహారం దక్కదని చెప్పారు. టీడీపీ హయాంలో 70 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీగోపాలస్వామి రథం దగ్ధమైందని... దీనికి చంద్రబాబు, బీజేపీ, పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలని అన్నారు. అంతర్వేది ఘటనను కావాలనే రాజకీయం చేస్తున్నారని... టీడీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విన్నవించారు.

40 దేవాలయాలను కూల్చిన చరిత్ర చంద్రబాబుదని వెల్లంపల్లి విమర్శించారు. అంతర్వేది కేసును సీబీఐకి అప్పగించామని చెప్పారు. దేవాలయాల వద్ద భక్తులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చేయని తప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అంటకట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గాలను సమర్థించవద్దని కోరారు.
Vellampalli Srinivasa Rao
YSRCP
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena
BJP
Antarvedi

More Telugu News