Rakul Preet Singh: అర్జున్ కు కరోనా రావడంతో మా షూటింగ్ రద్దయింది: రకుల్ ప్రీత్ సింగ్

Our shooting cancelled as Arjun tested Corona positive says Rakul Preet Singh
  • బాలీవుడ్ లో అర్జున్ కపూర్ సరసన నటిస్తున్న రకుల్
  • ముంబైకి వెళ్తుండగా అర్జున్ కు కరోనా వచ్చినట్టు ఫోన్
  • షూటింగ్ స్పాట్ కు వెళ్లలేదన్న రకుల్
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా రిపోర్ట్ రావడానికి రెండు రోజుల ముందు అర్జున్ సినిమా షూటింగులో పాల్గొన్నాడు. ఆ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి రకుల్ బయల్దేరింది. అయితే ఎయిర్ పోర్టులో విమానం టేకాఫ్ అవ్వడానికి ముందు తనకు ఫోన్ వచ్చిందని... అర్జున్ కు పాజిటివ్ రావడంతో షూటింగ్ రద్దు చేసినట్టు చెప్పారని ఈ సందర్బంగా రకుల్ తెలిపింది. దాంతో, తాను షూటింగ్ స్పాట్ కు వెళ్లలేదని చెప్పింది. ప్రస్తుతం అర్జున్ ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిపింది. ముంబైకి వెళ్లే ముందు తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని... పరీక్షల్లో తనకు నెగెటివ్ వచ్చిందని చెప్పింది.
Rakul Preet Singh
Bollywood
Tollywood
Arjun Kapoor
Corona Virus

More Telugu News