Donald Trump: క‌రోనా త‌గ్గుతుంద‌న్న ట్రంప్.. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను కొట్టిపారేసిన ఫౌచీ

fouci rejects trump comments on virus
  • అమెరికాలో క‌రో‌నా‌ తీవ్రత ఇప్ప‌టికీ ప్రమాదకరంగా ఉంది
  • పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల రేటు ఆందోళనకరం
  • ప్ర‌తిరోజు సుమారు 40 వేల కేసులు
కరోనా వైరస్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్యలను  అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ కొట్టిపారేశారు. ఇప్ప‌ట్లో క‌రోనా  అదుపులోకి వస్తుందని ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌ను తాము స‌మ‌ర్థించ‌డం లేద‌ని చెప్పారు.

అమెరికాలో క‌రోన‌నా‌ తీవ్రత ఇప్ప‌టికీ ప్రమాదకరంగానే ఉందని తెలిపారు. కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల రేటు ఆందోళనకరంగా ఉంద‌ని చెప్పారు. ప్ర‌తిరోజు దాదాపు  సుమారు 40 వేల కేసులు న‌మోదవుతున్నాయ‌ని, అదే స‌మ‌యంలో వెయ్యికి పైగా మరణాలు సంభ‌విస్తున్నాయ‌ని చెప్పారు. క‌నుక ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌తో తాను విభేదిస్తున్నానని తెలిపారు.

శీతకాలం రావడానికి ముందే వైరస్‌ను అదుపులోకి తీసుకురావడం చాలా  ముఖ్యమని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం నిర్వహించడంపై కూడా ఆయ‌న అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. క‌రోనా స‌మ‌యంలో ఇటువంటి స‌భ‌లు స‌రికాద‌ని చెప్పారు.
Donald Trump
usa
Corona Virus

More Telugu News