Kamal Haasan: 'ఇండియన్ 2' విషయంలో కమల్ నిర్ణయం.. దర్శకుడికి తుదిగడువు!

Kamal to complete Indian sequel by January
  • 'భారతీయుడు' చిత్రానికి శంకర్ సీక్వెల్ 
  • జనవరిలోగా తన షూటింగ్ పూర్తిచేయమన్న కమల్ 
  • ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు
  • తిరిగి రాజకీయాలలో బిజీ కానున్న కమల్
రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చిన 'భారతీయుడు' సినిమా ఒక సంచలనం. వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై కొత్త శైలి పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కమలహాసన్ చూపిన అభినయం.. దర్శకుడు శంకర్ ప్రతిభ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం మ్యూజికల్ గా కూడా పెద్ద హిట్.

ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ చేస్తున్న సంగతి విదితమే. 'ఇండియన్ 2'గా రూపొందుతున్న ఈ చిత్రం చాలావరకు షూటింగ్ లాక్ డౌన్ కు ముందు జరిగింది. ఇక ఇప్పుడు మళ్లీ తదుపరి షూటింగును ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో, తన షూటింగ్ భాగాన్ని ఎట్టి పరిస్థితులలోనూ వచ్చే జనవరిలోగా పూర్తి చేసేయాలని కమల్ దర్శకుడు శంకర్ కి తాజాగా సూచించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే, ఆమధ్య కమల్ రాజకీయపార్టీని నెలకొల్పి రాజకీయాలలో సైతం బిజీ అయ్యారు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో తాను పాల్గొనవలసి వున్నందున కమల్ ఈ చిత్రాన్ని ముందుగానే పూర్తిచేసుకుని, ఇక రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం.

ఈ సీక్వెల్ లో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సిద్ధార్థ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్టు చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Kamal Haasan
Shankar
Indian 2
Kajal Agarwal
Rakul Preet Singh

More Telugu News