ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ ఇక లేరు!
- ఢిల్లీలోని ఐఎల్ బీఎస్ లో కన్నుమూత
- కాలేయ వ్యాధితో బాధపడుతున్న స్వామి అగ్నివేశ్
- నాలుగు రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స
స్వామి అగ్నివేశ్ వయసు 80 సంవత్సరాలు. ఆయన 1939 సెప్టెంబరు 21న శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. ఆయన అసలు పేరు వేప శ్యాంరావు. ఆయన కోల్ కతాలో విద్యాభ్యాసం చేశారు. లా, కామర్స్ అంశాల్లో పట్టా అందుకున్నారు. ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించిన స్వామి అగ్నివేశ్ 1977లో హర్యానాలో శాసనసభ్యుడిగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. నాడు ఉమ్మడి ఏపీలో మావోయిస్టులతో చర్చలు జరిపిన సమయంలో అగ్నివేశ్ ప్రముఖ పాత్ర పోషించారు.