Cherukuvada Sriranganadha Raju: అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే: ఏపీ మంత్రి శ్రీరంగనాథ రాజు

I have not done any corruption says Sriranganadha Raju
  • నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు
  • చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారు
  • కుమారుడి స్కాంకు, తండ్రికి సంబంధం లేదనడం న్యాయమా?
తనపై వస్తున్న అవినీతి ఆరోపణల పట్ల ఏపీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఘాటుగా స్పందించారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని... తాను అవినీతి చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో జరిగిన వైయస్సార్ ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు.

బీసీ కార్డును అడ్డుపెట్టుకుని చంద్రబాబు కుల రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. మాజీ మంత్రి పితాని కుమారుడు కుంభకోణానికి పాల్పడ్డారని... ఆ కుంభకోణానికి, తండ్రికి సంబంధం లేదని అనడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. మరోవైపు శ్రీరంగనాథరాజుపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా అవినీతి ఆరోపణలు చేశారు. రంగనాథరాజు, ఆయన కుమారుడు వెంకటనరసింహరాజు ఇద్దరూ ఇళ్ల స్థలాల విషయంలో అవినీతికి పాల్పడ్డారని రఘురాజు ఆరోపించారు.
Cherukuvada Sriranganadha Raju
YSRCP
Corruption
Chandrababu
Raghu Ramakrishna Raju

More Telugu News