Corona Virus: తెలంగాణలో లక్షన్నర దాటిన కొవిడ్ కేసులు!

Corona cases in Telangana crossed one and half lakh mark
  • నిన్న 62 వేల మందికిపైగా పరీక్షలు
  • రాష్ట్రంలో 940కి పెరిగిన మృతుల సంఖ్య
  • భారీ సంఖ్యలో కోలుకుంటున్న బాధితులు
తెలంగాణ కొవిడ్ కేసుల సంఖ్య లక్షన్నర దాటిపోయింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,426 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,52,602కు పెరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ద్వారా తెలుస్తోంది. అలాగే, నిన్న 13 మంది కరోనా కారణంగా మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 940కి పెరిగింది.

మరోవైపు, రాష్ట్రంలో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుండడం గమనార్హం. నిన్న ఒక్క రోజే 2,324 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా కోరల నుంచి బయటపడిన వారి సంఖ్య 1,19,467కు చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 32,195 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరిలో 25,240 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 62,890 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు  రాష్ట్రంలో 20,16,461 మందికి పరీక్షలు చేశారు.
Corona Virus
Telangana
covid deaths

More Telugu News