: నేతల తీరుపై జిల్లా నాయకుల ఆగ్రహం

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై స్వంత పార్టీ జిల్లా స్థాయి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో జరుగుతున్న పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అసంతృప్తి వెళ్లగక్కారు. మైనార్టీలంతా వైఎస్ఆర్ సీపీ వైపే ఉన్నారని, మైనార్టీల కోసం ఏదైనా కొత్త పథకం ప్రవేశపెడితే కానీ కాంగ్రెస్ వైపు వచ్చే పరిస్థితి లేదని కదిరి బ్లాక్ అధ్యక్షుడు బాహుద్దీన్ చెబితే, ప్రత్యేక రాష్ట్రం ప్రకటించకుంటే కాంగ్రెస్ తెలంగాణలో బతికి బట్టకట్టదని అదిలాబాద్ నేత హరికృష్ణ స్పష్టం చేసారు. కాంగ్రెస్ పథకాలు జిల్లా నేతలకే తెలియకపోతే ప్రజలకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. గతంలో చెన్నారెడ్డి, వైఎస్ ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తే ఇప్పుడున్న పాలకులు పెళ్ళికొడుకుల్లా భోగాలు అనుభవిస్తున్నారని కామారెడ్డి నేత తిరుమల్ గౌడ్ విమర్శించారు.

More Telugu News