Chiranjeevi: గుండు బాస్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ఫొటో!

Chiranjeevi new look
  • గుండు గెటప్ లో చిరంజీవి
  • 'నేను సన్యాసిలా ఆలోచించగలనా?' అని క్యాప్షన్
  • వెల్లడి కావాల్సిన పూర్తి వివరాలు
మెగాస్టార్ చిరంజీవి న్యూలుక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇన్స్ట్రగ్రామ్ లో ఆయన షేర్ చేసిన ఫొటోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గుండుతో చిరు కనిపిస్తున్నారు. అయితే, చిరుగడ్డం, చిరుమీసంతో నల్ల కళ్లజోడు ధరించి చిరంజీవి డిఫరెంట్ లుక్ లో ఉన్నారు.

'నేను సన్యాసిలా ఆలోచించగలనా?' అనే క్యాప్షన్ ను కూడా చిరు ఇచ్చారు. ఇంతకు మించి ఫొటో గురించి ఆయన వివరాలను వెల్లడించలేదు. ఇది నిజమైన గుండేనా? లేక ఫ్యూచర్ ప్రాజెక్ట్ కోసం ఏదైనా ఫొటో షూట్ చేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
Chiranjeevi
Tollywood
New Getup

More Telugu News