Nara Lokesh: ఆదర్శ దంపతులకు అసలైన నిర్వచనమయ్యారు మీరు!: అమ్మానాన్నలకు లోకేశ్ శుభాకాంక్షలు

lokesh wishes chandrababu
  • అమ్మానాన్నలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
  • ప్రజల కోసం ఒకరు, కుటుంబం కోసం మరొకరు శ్రమిస్తున్నారు
  • ఒకరి ఆశయాలకు మరొకరు అండగా నిలిచారు
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ఈ రోజు పెళ్లి రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా వారి ఫొటోను పోస్ట్ చేస్తూ వారి కుమారుడు నారా లోకేశ్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

"అమ్మానాన్నలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు! ప్రజల కోసం ఒకరు, కుటుంబం కోసం మరొకరు శ్రమిస్తూనే... ఒకరి ఆశయాలకు మరొకరు అండగా నిలిచి, ఆదర్శ దంపతులకు అసలైన నిర్వచనమయ్యారు మీరు. మీరిలాగే ఆది దంపతుల్లా కలకాలం మా కళ్ల‌కు పండువ‌గా నిలవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

Nara Lokesh
Chandrababu
Telugudesam

More Telugu News