Imarti Devi: ఆవు పేడలో పుట్టి పెరిగిన దాన్ని.. కరోనా నన్నేం చేస్తుంది: మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యల వీడియో వైరల్

Born in cow dung  coronavirus cant come near me says MP minister
  • మంత్రికి కరోనా సోకిందంటూ వార్త రాసిన విలేకరి
  • మండిపడిన మంత్రి ఇమర్తీదేవి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
తనకు కరోనా సోకిందంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ, మధ్యప్రదేశ్ మంత్రి ఇమర్తీ దేవి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను ఆవుపేడలో పుట్టి పెరిగిన దాన్నని, అది తనను ఏమీ చేయలేదని తేల్చి చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మంత్రి ఇమర్తికి కరోనా సోకిందంటూ స్థానిక విలేకరి ఒకరు వార్త రాశాడు. ఇది చూసిన మంత్రి అతడిపై ఓ రేంజ్‌లో మండిపడ్డారు. ఇలాంటి అబద్ధపు వార్తలు రాయడం మానుకోవాలని సూచించారు. తాను ఆవు పేడలో పుట్టిపెరిగానని, ఇలాంటి  కరోనా, గిరోనాలు తనను ఏమీ చేయలేవని తేల్చి చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్లతో నవ్వు తెప్పిస్తున్నారు.
Imarti Devi
Madhya Pradesh
Corona Virus
cow dung

More Telugu News