Mahesh Babu: మహేశ్ బాబు కళ్లు చెదిరే కొత్త లుక్కు... ఇదిగో!

Here it is Mahesh Babu stunning new look
  • యాడ్ ఫిలిం షూట్ లో పాల్గొన్న మహేశ్ బాబు
  • చాన్నాళ్ల తర్వాత సెట్స్ మీదకు వచ్చిన సూపర్ స్టార్
  • మహేశ్ ఫొటో పంచుకున్న యాడ్ ఫిలింమేకర్ అవినాశ్ గోవారికర్
లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. అయితే అది సినిమా షూటింగ్ కాదు. ఓ యాడ్ ఫిలిం షూటింగ్ కోసం మహేశ్ సెట్స్ మీదకు వచ్చారు. ఈ యాడ్ ను నేషనల్ లెవెల్ యాడ్ ఫిలింమేకర్ అవినాశ్ గోవారికర్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా షూట్ ముగిసిన తర్వాత గోవారికర్ మహేశ్ బాబును ఫొటోలు తీశారు. వాటిలో కళ్లుచెదిరే రీతిలో స్టన్నింగ్స్ లుక్స్ తో ఉన్న ఒక ఫొటోను గోవారికర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిపై మహేశ్ బాబు వ్యాఖ్యానిస్తూ మళ్లీ పనిలో దిగడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Mahesh Babu
New Look
Ad Film
Shoot
Avinash Gowarikar

More Telugu News