Kangana Ranaut: ఆమె సినిమాకి పనిచేయనన్న పీసీ శ్రీరాం.. వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చిన కంగనా!

Kangana Ranauth strong reply to PC Sriram
  • ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న కంగనా 
  • ఆమెతో అసౌకర్యంగా ఉంటుందన్న సినిమాటోగ్రాఫర్
  • సినిమా యూనిట్ అర్థం చేసుకుందన్న శ్రీరాం
  • ఆ అసౌకర్యం ఏమిటో తెలియదన్న కంగనా   
బాలీవుడ్ నటి కంగనాకు ఫైర్ బ్రాండ్ గా పేరుంది. తన జోలికి ఎవరైనా వస్తే  వాళ్లు ఎంతటి వారైనా సరే వదలదు. కౌంటర్ ఇచ్చి తీరుతుంది. పైపెచ్చు విమర్శలతో ఉతికి ఆరేస్తుంది. అందుకే సాధారణంగా ఎవరూ ఆమె జోలికి వెళ్లరు. ఆమెతో ఎందుకులే అని ఊరుకుంటారు. ప్రస్తుతం ఆమె మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలతోనే ఢీ అంటే ఢీ అంటోంది.

ఇలాంటి సమయంలో ఆమె నటించే చిత్రాన్ని తిరస్కరించడమే కాకుండా, ఆమె హర్ట్ అయ్యేలా కామెంట్ చేసి, వార్తల్లోకి ఎక్కాడు ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరాం. 'కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తుండబట్టి ఓ చిత్రాన్ని తిరస్కరించాను. ఆమెతో పనిచేయాలంటే అసౌకర్యంగా ఫీలయ్యాను. అదే విషయాన్ని చిత్ర నిర్మాతలకు వివరించడంతో, వారు పరిస్థితి అర్థం చేసుకున్నారు. మనకు ఏది సరైనదని అనిపిస్తే ఒక్కోసారి అదే చేయాలి' అంటూ పీసీ శ్రీరాం పేర్కొన్నాడు.

దీంతో కంగనా బాగా అప్సెట్ అయింది. వెంటనే ప్రతిస్పందిస్తూ శ్రీరాంకి వ్యంగ్యంతో కూడిన కౌంటర్ ఇచ్చింది. 'మీలాంటి లెజండ్ తో వర్క్ చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నాను సర్. ఇది నాకు పూర్తిగా నష్టం లాంటిదే! అయితే, నాతో పనిచేయడానికి అసౌకర్యంగా ఫీలయ్యేంత విషయం ఏమిటో నాకు తెలియడం లేదు. కానీ, మీరు సరైన నిర్ణయమే తీసుకున్నందుకు నాకు ఆనందంగానే వుందిలెండి.. మీకు ఆల్ ది బెస్ట్' అంటూ జవాబు ఇచ్చింది. మరి దీనిపై శ్రీరాం ఎలా స్పందిస్తాడో చూడాలి!          
Kangana Ranaut
PC Sriram
Legend

More Telugu News