Akbaruddin Owaisi: మంత్రి ఈటల ప్రసంగం కరోనా హెల్త్ బులెటిన్ లా ఉంది: అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శలు

MIM member Akbaruddin Owaisi disappoints with minister Eatala Rajender speech on corona
  • తెలంగాణ అసెంబ్లీలో కరోనా అంశంపై స్వల్పకాలిక చర్చ
  • కరోనాపై ప్రకటన చేసిన ఈటల
  • కరోనా వారియర్స్ గురించి ఎక్కడా చెప్పలేదన్న ఒవైసీ
తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ కరోనాపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ప్రసంగంపై ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి ఈటల ప్రసంగం కరోనా హెల్త్ బులెటిన్ లా ఉందని విమర్శించారు. కరోనాపై ప్రభుత్వ ప్రకటన అసమంజసంగా ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా వారియర్స్ ను ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించకపోవడం దారుణమని పేర్కొన్నారు. కొవిడ్ నిధికి విరాళాలు ఇచ్చిన వారిని గుర్తించకపోవడం బాధాకరమని అన్నారు.
Akbaruddin Owaisi
Etela Rajender
Speech
Corona Virus
Health Bulletin
Assembly
Telangana

More Telugu News