Chandrababu: నిరంకుశ వైసీపీ పాలనలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు: చంద్రబాబు

Chandrababu says attacks continues on faiths in AP
  • ఏపీ బహుజనవాద రాష్ట్రం అంటూ చంద్రబాబు ట్వీట్
  • వైసీపీ వచ్చాక విశ్వాసాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణ
  • 20కి పైగా దాడులు జరిగాయని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతిశీల, వివిధ వర్గాల ప్రజల రాష్ట్రంగా ఉండేదని, అన్ని మత విశ్వాసాలు వికాసం పొందాయని, శాంతియుతంగా కలసిమెలసి ఉండే పరిస్థితి ఉండేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వివరించారు. కానీ, నిరంకుశ వైసీపీ పాలన మొదలయ్యాక తమ మత విశ్వాసాలపై వరుసగా జరుగుతున్న దాడులతో ఏపీ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ తరహా దాడులు 20కి పైగా జరిగాయని చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Chandrababu
Attacks
Faiths
YSRCP
Andhra Pradesh

More Telugu News