Kodali Nani: అది కొడాలి నాని అభిప్రాయం మాత్రమే: బొత్స

It is Kodali Nanis personnel opinion says Botsa Satyanarayana
  • అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండకూడదన్న కొడాలి నాని
  • శాసన రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామని ప్రభుత్వం చెప్పలేదన్న బొత్స
  • ప్రజలందరికీ రాజధాని అనువుగా ఉండాలనేది నాని అభిప్రాయమని వ్యాఖ్య
అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండకూడదని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, కొడాలి నాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు. శాసన రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామని ప్రభుత్వం చెప్పలేదని అన్నారు.

అన్ని వర్గాల ప్రజలు ఉండేందుకు అనువుగా రాజధాని ఉండాలనే ఉద్దేశంతో నాని అలా మాట్లాడారని చెప్పారు. కొంత మందే రాజధానిలో ఉండాలనే అభిప్రాయం తప్పు అనేది నాని అభిప్రాయమని అన్నారు. రాజధానిలో పేదలకు పట్టాలు ఇవ్వొద్దని చెప్పడం సబబు కాదని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని... అయితే కొందరు కూట్రపూరితంగా సాంకేతిక అంశాలను అడ్డు పెట్టుకుని ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
Kodali Nani
Botsa Satyanarayana
YSRCP
Amaravati

More Telugu News