Amaravati: అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తు కొనసాగుతోంది: జాతీయ మీడియాతో జగన్

SIT probe is going on Amaravati scam says Jagan
  • సిట్ దర్యాప్తులో బినామీలు బయటపడతారు
  • రాజధాని కోసం లక్షల కోట్ల నిధులు అనవసరం
  • అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు
గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని... దానిపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిట్ దర్యాప్తులో బినామీదారులంతా బయటపడటం ఖాయమని చెప్పారు. రాజధాని కోసం వేల ఎకరాల భూములు, లక్షల కోట్ల నిధులు అనవసరమని తెలిపారు. పెట్టుబడులన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావడం మంచిది కాదని చెప్పారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
Amaravati
Jagan
YSRCP

More Telugu News