Narendra Modi: భారత్ గ్లోబల్ మీడియాగా ఎదగాలి: మోదీ

Indian media has to grow to global level says Modi
  • ప్రపంచ దేశాలు మన వైపే చూస్తున్నాయి
  • మనం చెప్పే మాటను వింటాయి
  • యువత పుస్తకాలు ఎక్కువగా చదవాలి
ప్రపంచంలోని అన్ని దేశాలు ఇప్పుడు  మనవైపే చూస్తున్నాయని... మనం చెప్పే మాటను వింటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సమాచారాన్ని శ్రద్ధగా తెలుసుకుంటున్నాయని... ఈ నేపథ్యంలో భారత్ గ్లోబల్ మీడియాగా ఎదగాలని చెప్పారు.

భారత మీడియా ఖండాంతరాలను దాటి వెళ్లాలని పిలుపునిచ్చారు. యువత పుస్తకాలు ఎక్కువగా చదవాలని సూచించారు. సోషల్ మీడియా పాప్యులర్ అవుతున్న ఈరోజుల్లో... యువత విజ్ఞానాన్ని పెంచుకోవడానికి దూరం కాకూడదని చెప్పారు. 'పత్రిక గ్రూప్'  ఛైర్మన్ గులాబీ కొఠారీ రాసిన రెండు పుస్తకాలను ఈరోజు మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
Narendra Modi
Media
BJP

More Telugu News