Devineni Uma: ఇది మాటతప్పడం, మడమతిప్పడం కాదా?: దేవినేని ఉమ‌

devineni slams jagan
  • నాడు మీటర్లబిగింపున‌కు వ్యతిరేకమన్నారు  
  • నేడు మీటర్ల బిగింపున‌కు ఎందుకంత తొందర?
  • సంపదను సృష్టించడం చేతగాక అప్పులు
  • రాష్ట్రాన్ని, రైతులను తాకట్టు పెడతారా?
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణయించిన విష‌యం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు మ‌రోసారి విమర్శ‌లు గుప్పించారు. నాడు మీటర్ల బిగింపున‌కు వ్యతిరేకమన్నారు, నేడు మీటర్ల బిగింపుకు ఎందుకంత తొందర? మీటర్లు లేకుండానే టీడీపీ  హయాంలో చంద్ర‌బాబు నాయుడు రైతులకు పగటిపూట నాణ్యమైన 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారు. సంపదను సృష్టించడం చేతగాక అప్పులు చేయడంకోసం రాష్ట్రాన్ని, రైతులను తాకట్టు పెడతారా? ఇది మాటతప్పడం, మడమతిప్పడం కాదా?  వైఎస్ జ‌గ‌న్ గారు? అని ఆయ‌న నిల‌దీశారు.

కాగా, అప్పులు తెచ్చుకోవడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందంటూ ఆంధ్ర‌జ్యోతిలో వ‌చ్చిన క‌థ‌నాన్ని ఈ సంద‌ర్భంగా దేవినేని ఉమ పోస్ట్ చేశారు. నగదు బదిలీని ఏదైనా ఒక జిల్లాలో ఈ డిసెంబరులోగా అమలు చేయాలని కేంద్రం సూచించిందని, అయితే,  మీటర్లు పెట్టకుండానే, ఎలాంటి ఏర్పాట్లు చేయకుండానే ఈ నెల నుంచే డిస్కమ్‌లకు నగదు బదిలీ చేయాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయని అందులో పేర్కొన్నారు.
Devineni Uma
Telugudesam
YSRCP

More Telugu News