Metro Rail: తొలిరోజు వెలవెలబోయిన హైదరాబాద్ మెట్రో రైళ్లు!

No response from passengers for Hyderabad Metro
  • ఐదు నెలల తర్వాత ప్రారంభమైన మెట్రో రైళ్లు
  • కరోనా భయాలతో రైళ్లెక్కడానికి ఆసక్తి చూపని ప్రయాణికులు
  • ఢిల్లీ మెట్రోలో సైతం ఇదే పరిస్థితి
కరోనా  కారణంగా దాదాపు ఐదు నెలల పాటు మూతపడిన హైదరాబాద్ మెట్రో రైలు సేవలు ఈరోజు పునఃప్రారంభమయ్యాయి. అన్ లాక్ 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వడంతో.. మెట్రో రైళ్లు ఈరోజు పట్టాలెక్కాయి. అయితే, మెట్రో సేవలకు ప్రయాణికుల నుంచి స్పందన కరవైంది. కరోనా నేపథ్యంలో, క్లోజ్డ్ గా ఉండే మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు జనాలు ఆసక్తి చూపలేదు. తక్కువ సంఖ్యలోనే ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు వెళ్లారు. ఢిల్లీ మెట్రోలో సైతం ఇదే పరిస్థితి కనిపించింది. మరోవైపు మెట్రో అధికారులు మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుందని చెప్పారు.
Metro Rail
First Day
Hyderabad

More Telugu News