Budda Venkanna: మంత్రి గౌతమ్ రెడ్డి అమాయకత్వాన్ని చూసి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడంలేదు: బుద్ధా వెంకన్న 

Budda Venkanna satirical comments on AP Minister Mekapati Gowtham Reddy
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి నెంబర్ 1
  • సీఎం జగన్ ను కలిసిన మంత్రి మేకపాటి బృందం
  • గౌతమ్ కు చిన్న పరీక్ష అంటూ బుద్ధా వ్యంగ్యం
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ మొదటి ర్యాంకులో నిలిచిన నేపథ్యంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, ఇతర ఉన్నతాధికారులు సీఎం జగన్ ను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. మంత్రి గౌతమ్ రెడ్డి అమాయకత్వాన్ని చూసి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు.

జగన్ రెడ్డి సంస్కరణల కారణంగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి నెంబర్ 1 వచ్చిందని అంటున్న గౌతమ్ కి చిన్న పరీక్ష అంటూ ట్వీట్ చేశారు. ఈ ఏడాదిన్నరలో మీ జగన్ గారు తెచ్చిన పాలసీ చూసి రాష్ట్రానికి వచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పాలి అంటూ బుద్ధా ప్రశ్నించారు.

వైసీపీ పారిశ్రామిక పాలసీతో పాటు మేకపాటి గౌతమ్ గారి కండలు చూసి క్యూ కట్టిన పారిశ్రామికవేత్తలు అని బ్లూ మీడియా వార్తలు తప్ప, క్యూ ఎక్కడ ఉందో కనపడడంలేదని ఎద్దేవా చేశారు. 'క్యూ ఎక్కడ ఉందో చెబితే ఎండకి నీరసం రాకుండా మజ్జిగ ప్యాకెట్లు పంచుతాం గౌతమ్ గారు' అంటూ బుద్ధా వ్యంగ్యం ప్రదర్శించారు.
Budda Venkanna
Mekapati Goutham Reddy
Ease Of Doing Business
Andhra Pradesh
Jagan
YSRCP

More Telugu News