Sajjala Ramakrishnareddy: జగన్ పాలనను చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తారా?: చంద్రబాబుపై సజ్జల విమర్శనాస్త్రాలు

Sajjala Ramakrishna Reddy fires on TDP Chief Chandrababu Naidu
  • సీఎం జగన్ కు ప్రజాదరణ పెరుగుతోంది 
  •  మీది పచ్చి రాజకీయ స్వార్థం కాదా? 
  •  ఇది మీరు, మీ మీడియా వేసిన పన్నాగం కాదా? అన్న సజ్జల 
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పించారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా, అవినీతికి తావులేకుండా ప్రజలంతా నా వాళ్లే అనే భావనతో సాగుతున్న సీఎం జగన్ కు ప్రజాదరణ పెరుగుతోందని, జగన్ పాలనకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు గారూ... వయసుతో పాటు మీ మెదడు ఎంత కుళ్లిపోయిందో అర్థం కావడంలేదా? అని ప్రశ్నించారు.

"మీది పచ్చి రాజకీయ స్వార్థం కాదా? చెదురుమదురు ఘటనలను దళితులపై దాడులు గానూ, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే హిందూ వ్యతిరేక చర్యలుగా ప్రచారం చేసి లబ్ది పొందాలనుకోవడం లేదా? ఏదో రకంగా చిచ్చుపెట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి మీరు, మీ మీడియా వేసిన పన్నాగం కాదా?" అంటూ తీవ్రంగా స్పందించారు.
Sajjala Ramakrishnareddy
Chandrababu
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News