Nakka Anand Babu: దళితులపై దాడుల వెనుక విజయసాయిరెడ్డి హస్తం ఉంది: నక్కా ఆనందబాబు

Vijayasai Reddy is behind attacks on dalits says Nakka Anand Babu

  • దళితులపై దాడులకు విజయసాయే కారణం
  • అయింనపూడిలో దళిత మహిళను సజీవ దహనం చేసేందుకు యత్నించారు
  • దళితులపై 150కి పైగా దాడులు జరిగాయి

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల వెనుక వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హస్తం వుందని టీడీపీ నేత నక్కా ఆనందబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. దాడులన్నీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని అన్నారు.

అయినంపూడిలో దళిత మహిళను సజీవ దహనం చేయడానికి ప్రయత్నించారని... ఈ ఘనటకు నిరసనగా ఛలో అయినంపూడికి టీడీపీ, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు పిలుపునిస్తే అక్కడకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. బాధితులకు అండగా ఉండేవారిని అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు.

శివప్రసాద్ కు శిరోముండనం జరిగినప్పుడే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ఉంటే శ్రీకాంత్ శిరోముండనం జరిగి ఉండేది కాదని ఆనందబాబు చెప్పారు. వైసీపీ పాలనలో దళితులపై ఇప్పటి వరకు 150కి పైగా దాడులు జరిగాయని విమర్శించారు. అంబేద్కర్ స్మృతివనాన్ని కూడా నిర్వీర్యం చేయాలనుకుంటున్నారని చెప్పారు. దళితులపై జరిగిన దాడులన్నింటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News