Chiranjeevi: ఈ ఇండ‌స్ట్రీలో మీకు స‌హ‌చ‌రుడిగా ఉన్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాను: మమ్ముట్టికి చిరు విషెస్

Happy Birthday Dear   mammukka
  • ఈ రోజు మలయాళ నటుడు మమ్ముట్టి బ‌ర్త్ డే 
  • సినీ రంగానికి మీరు అందిస్తున్న సేవ‌లు గొప్ప‌వి
  • సినీ ప్రేమికులు ఎప్ప‌టికీ గుర్తు చేసుకుంటారు
మలయాళ సినిమా అగ్రనటుల్లో ఒక‌రైన మ‌మ్ముట్టి ఈ రోజు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటోన్న సంద‌ర్భంగా ఆయ‌నకు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా మమ్ముట్టికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

"హ్యాపీ బ‌ర్త్ డే డియ‌ర్ మ‌మ్ముట్టి.. ఈ అద్భుత‌మైన ఇండ‌స్ట్రీలో మీకు స‌హ‌చ‌రుడిగా ఉన్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాను. ఇన్నేళ్లుగా సినీ ప‌రిశ్ర‌మ‌కు మీరు అందిస్తున్న సేవ‌లు చాలా గొప్ప‌వి. సినీ ప్రేమికులు ఎప్ప‌టికీ వాటిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ప్రేక్ష‌కులను ఎప్పటికీ మీరు ఇలాగే ఉత్సాహపరుస్తూ ఉంటార‌ని ఆశిస్తున్నాను" అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Chiranjeevi
Tollywood
Twitter

More Telugu News