Somireddy Chandra Mohan Reddy: ఎన్టీఆర్ జీవితచరిత్రను తెలంగాణలో పాఠ్యాంశంగా చేర్చడం చాలా సంతోషం కలిగిస్తోంది: సోమిరెడ్డి

Somireddy Chandramohan Reddy thanked CM KCR for including NTR life as a lesson in Telangana
  • ఎన్టీఆర్ ను యుగపురుషుడిగా అభివర్ణించిన సోమిరెడ్డి
  • తెలుగుదనానికి వన్నె తెచ్చారంటూ ట్వీట్
  • సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ నేత
విశ్వవిఖ్యాత కథానాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జీవితచరిత్రను తెలంగాణలో పాఠ్యాంశంగా చేర్చారంటూ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.

దీనిపై ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ... ఎన్టీఆర్ యుగపురుషుడు అని, అటు సినిమా రంగం, ఇటు రాజకీయాల్లో రాణించి తెలుగుదనానికి వన్నె తెచ్చిన మహానుభావుడు అని కీర్తించారు. ఇప్పుడు ఎన్టీఆర్ చరిత్రను తెలంగాణలో పాఠ్యాంశంగా చేర్చడం చాలా సంతోషం కలిగిస్తోందని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు సోమిరెడ్డి పేర్కొన్నారు.
Somireddy Chandra Mohan Reddy
NTR
Life
Lesson
KCR
Telangana

More Telugu News