Vijay Sai Reddy: అబద్ధం నడిచొస్తే చంద్రబాబులా వుంటుంది.. దీనికి తాజా నిదర్శనమిది: విజ‌య‌సాయిరెడ్డి

vijaya saireddy slams chandrababu naidu
  • ఏపీ ప్ర‌జ‌ల‌కు ఉచిత విద్యుత్ అందుతోంది
  • వైఎస్సార్ గారు సీఎంగా తొలి సంతకం చేశారు
  • దీనిపై కూడా అబద్ధ‌మాడేశారు చంద్రబాబు
  • నీ అబద్దాలకు ప్రజలు సిగ్గుపడుతున్నారు  
ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులకు నగదు బదిలీ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, జీవో ఎంఎస్ నెం. 22ని ఏపీ విడుదల చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఉచిత విద్యుత్ గురించి ఇటీవ‌ల టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌ల‌పై వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

"అబద్ధం నడిచొస్తే చంద్రబాబులా వుంటుంది. దీనికి తాజా నిదర్శనం.. కోట్లాది ప్రజల సమక్షంలో ఉచిత విద్యుత్ పై మహానేత రాజశేఖరరెడ్డి గారు సీఎంగా చేసిన తొలి సంతకంపై కూడా అబద్ధమాడేశారు చంద్రబాబు. నీ అబద్ధాలకు ప్రజలు సిగ్గుపడుతున్నారు 'ఛీ'బిఎన్. నీయంత చరిత్రహీనుడిని ఈ దేశం చూడలేదు, చూడబోదు అని ఎంపీ విజ‌యసాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

Vijay Sai Reddy
YSRCP
Chandrababu

More Telugu News