China: ఎగ్జిబిష‌న్ లో రోలర్ కోస్టర్ ఎక్కిన 20 మంది.. పైకెళ్లి ఆగిపోవ‌డంతో గంట‌సేపు న‌ర‌కం.. వీడియో ఇదిగో

 20 visitors were left hanging in the air for over an hour when a rollercoaster
  • చైనాలో ఘ‌ట‌న
  • భ‌యాందోళ‌న‌లు చెందిన 20 మంది
  • గంట‌సేపు శ్ర‌మించి కింద‌కు దించిన సిబ్బంది
హాలీడేను ఎంజాయ్ చేద్దామ‌ని ఎగ్జిబిష‌న్ కు వెళ్లిన 20 చైనీయులు గంట పాటు  న‌ర‌కాన్ని చ‌విచూశారు. తాము బ‌తుకుతామా? బ‌తక‌మా? అంటూ ఆందోళ‌న మ‌ధ్య గ‌డిపారు. తూర్పు చైనాలోని జియాంగ్సు లోని వుక్సీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అక్క‌డి ఎగ్జిబిష‌న్ లో రోలర్ కోస్టర్ ఎక్కిన 20 మంది చైనీయులు దానిలో ఇరుక్కుపోయారు.  

రోలర్ కోస్టర్ స్టార్ట్ అయిన కొద్దిసేప‌టికి పైకి వెళ్లి అది అక్క‌డే  ఆగిపోయింది. సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో అది మ‌ళ్లీ కింద‌కు రాలేదు. దాదాపు గంట‌సేపు అదిపైనే ఉండిపోయింది. చివ‌ర‌కు గంట సేపు శ్ర‌మించి దాన్ని కిందకు తీసుకొచ్చారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ్వ‌రికీ గాయాలు కాలేద‌ని అక్క‌డి సిబ్బంది తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో అక్క‌డి మీడియాకు చిక్కింది.
China
roller coaster

More Telugu News