విశాఖ కేంద్ర కారాగారానికి నూతన్ నాయుడు

Nutan Naidu sent to Anakapalle Jail
  • నిన్న ఉడుపిలో అరెస్ట్ చేసిన పోలీసులు
  • అర్ధరాత్రి వేళ విశాఖకు
  • కేజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలింపు
దళిత యువకుడికి శిరోముండనం కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు, సినీ నిర్మాత నూతన్ నాయుడిని పోలీసులు విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. నిన్న కర్ణాటకలోని ఉడుపిలో నూతన్ నాయుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి అర్ధరాత్రి విశాఖపట్టణానికి తీసుకొచ్చారు. కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో మొదట అనకాపల్లి సబ్ జైలు కు తరలించారు. కరోనా పరీక్షలో నూతన్ నాయుడుకి నెగిటివ్ అని తేలడంతో అక్కడినుంచి విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు.
Go Back to Shorts
Nutan Naidu
tonsure case
Visakhapatnam District
Anakapalle jail

More Telugu News