dorababu: ఏపీలో క‌రోనా బారిన ప‌డ్డ మ‌రో ఎమ్మెల్యే

dorababu tests corona positive
  • పెండెం దొరబాబుకు కరోనా పాజిటివ్
  • కాకినాడ ప్రైవేటు ఆసుప‌త్రిలో చేరిక‌
  • ప‌రామ‌ర్శించిన జ‌గ‌న్
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌రో ఎమ్మెల్యే క‌రోనా బారిన‌ప‌డ్డారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కరోనా పరీక్ష‌లు చేయ‌గా పాజిటివ్ అని తేలింది. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌.. ఈ రోజు ఉదయం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఈ విష‌యం నిర్ధార‌ణ అయింది.  

ప్ర‌స్తుతం ఆయ‌న‌ కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల తనను కలిసిన వారు క‌రోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయ‌న సూచించారు. కాగా, పెండెం దొరబాబును ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్  ఫోన్‌లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, త్వరలోనే కోలుకుంటార‌ని అన్నారు.
dorababu
YSRCP
Corona Virus

More Telugu News