Nadendla Manohar: జనసేనపై రెండు పార్టీల కుతంత్రాలను తిప్పికొట్టింది యువతే: నాదెండ్ల మ‌నోహర్

change possible with youth only nadendla
  • యువ‌ర‌క్తంతోనే రాజ‌కీయాల్లో మార్పు
  • విజ‌య‌ద‌శ‌మ‌ని మా క్షేత్ర‌స్థాయి కార్య‌క్ర‌మాలు
  • ప్ర‌స్తుత రాజ‌కీయాలు వ్యాపార‌ప‌రమ‌య్యాయి
  • కోట్లు ఉన్న‌వాడికే సీట్లు
జ‌న‌సేన పార్టీపై రెండు పార్టీల కుతంత్రాల‌ను యు‌వ‌తే తిప్పికొట్టింద‌ని ఆ పార్టీనేత నాదెండ్ల మ‌నోహర్ అన్నారు. యువ‌ర‌క్తంతోనే రాజ‌కీయాల్లో మార్పు వ‌స్తుంద‌ని ఆయన చెప్పారు. విజ‌య‌ద‌శ‌మి నుంచి బీజేపీ, జన‌సేన క్షేత్ర‌స్థాయి కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని తెలిపారు. ఈ రోజు ఆయ‌న బెంగ‌ళూరు ఐటీ నిపుణుల‌తో వెబినార్ ద్వారా చ‌ర్చా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా నాదెండ్ల మ‌నోహర్ మాట్లాడుతూ... ప్ర‌స్తుత రాజ‌కీయాలు వ్యాపార‌ప‌రం అయ్యాయ‌ని, నేత‌లు అడ్డ‌దారులు తొక్కుతున్నార‌ని ఆయ‌న అన్నారు. కోట్లు ఉన్న‌వాడికే సీట్లు ఇచ్చి ప్రోత్స‌హిస్తున్నార‌ని చెప్పారు. అలాంటి వారు ఎన్నిక‌ల్లో గెలిచాక పెట్టిన పెట్టుబ‌డిని సంపాదించ‌డానికే ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నార‌ని అన్నారు. మ‌న ద‌గ్గ‌ర ఎంపీ సీటుకు కోట్ల రూపాయ‌లు కుమ్మ‌రిస్తున్నార‌ని చెప్పారు.  

          
Nadendla Manohar
Janasena
Andhra Pradesh

More Telugu News