Samantha: కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన సమంత

Samantha starts new business
  • సినిమాలతో బిజీగా ఉంటూనే వ్యాపారాలపై దృష్టి
  • ఇప్పటికే జూబ్లీహిల్స్ లో ప్రీస్కూల్ ప్రారంభం
  • తాజాగా దుస్తుల వ్యాపారంలోకి అడుగు
స్టార్ హీరోయిన్ సమంత నటిగా తనను ప్రూవ్ చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సమంత డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమె కాల్షీట్ల కోసం దర్శకనిర్మాతలు ఎదురు చూసే పరిస్థితి ఇప్పటికీ ఉంది. మరోవైపు, సినిమాలతో బిజీగా ఉంటూనే ఇతర రంగాలపై కూడా ఆమె దృష్టి సారిస్తోంది.

ఇప్పటికే తన స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్ లో 'ఏకం' అనే ప్రీస్కూల్ ను ప్రారంభించింది. తాజాగా మహిళల వస్త్రాలకు సంబంధించిన బిజినెస్ లోకి అడుగుపెట్టబోతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆమె తెలిపింది. 'సాకి వరల్డ్' పేరుతో దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పింది. సాకిని ప్రారంభించాలని తాను ఎప్పటి నుంచో అనుకుంటున్నానని తెలిపింది. ఫ్యాషన్ పై తనకున్న ప్రేమకు సాకి ప్రతిరూపమని చెప్పింది.
Samantha
Tollywood
Business

More Telugu News