china: చైనా సైనికులు ఐదుగురు స్థానికులను అపహరించారు: అరుణాచల్ ఎమ్మెల్యే ఆరోపణ

Chinese Army Abducted 5 Indians
  • అరుణాచల్ ప్రదేశ్ లో అపహరణ
  • సుబానాసిరి జిల్లాలో అపహరించారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
  • గతంలో కూడా ఇలాంటివి జరిగాయని సంచలన వ్యాఖ్య
ఓవైపు లడఖ్ తూర్పు ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న చైనా... మరోవైపు అమానుష ఘటనలకు కూడా దిగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఐదుగురు స్థానికులను చైనా సైనికులు అపహరించారు. ఈ ఘటనపై స్థానికంగా కలకలం రేగుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నిన్నాంగ్ ఎరింగ్ మాట్లాడుతూ, సుబానాసిరి జిల్లాకు చెందిన ఐదుగురిని చైనా బలగాలు అపహరించాయని... గతంలో కూడా ఇలాంటివి జరిగాయని చెప్పారు. అంతేకాదు ఇదే విషయాన్ని ప్రధాని కార్యాలయానికి కూడా ట్యాగ్ చేశారు.
china
Arunachal Pradesh
Abduction

More Telugu News