Sanjay Manjrekar: సంజయ్‌ మంజ్రేకర్‌ ను పక్కన పెట్టిన బీసీసీఐ

Sanjay Manjrekar lost place in Commentators panel
  • ఏడుగురు సభ్యులతో ఐపీఎల్ కామెంటరీ ప్యానల్
  • సంజయ్ మంజ్రేకర్ కు దక్కని స్థానం
  • ప్యానల్  లో రోహన్ గవాస్కర్ కు చోటు
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కామెంటరీ ప్యానల్ లో మంజ్రేకర్ కు చోటు కల్పించలేదు. ఈ ప్యానల్ లో గవాస్కర్, మురళీ కార్తీక్, దీప్ దాస్ గుప్తా, శివరామకృష్ణన్, రోహన్ గవాస్కర్, హర్ష భోగ్లే, అంజుమ్ చోప్రాలకు చోటు కల్పించారు. మురళీ కార్తీక్, దాస్ గుప్తాలు అబుదాబిలో... మిగిలిన వారు దుబాయ్, షార్జా వేదికల్లో కామెంటేటర్లుగా వ్యవహరించనున్నారు. అబుదాబి, దుబాయ్ లలో 21 మ్యాచ్ లు, షార్జాలో 14 మ్యాచ్ లు జరగనున్నాయి.
Sanjay Manjrekar
IPL
Commentator
BCCI

More Telugu News