Chandrababu: గతంలో పార్టీని కాస్త నిర్లక్ష్యం చేసిన మాట నిజమే.. భవిష్యత్తులో అలాంటి తప్పు మళ్లీ జరగదని హామీ ఇస్తున్నా: చంద్రబాబు

Chandrababu accepts his negligence towards party
  • అనంతపురం ఎంపీ స్థానం పరిధి నేతలతో సమావేశం
  • గతంలో అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చానన్న చంద్రబాబు
  • ఆయా ప్రాంతాల్లో అవసరాల మేరకు బాధ్యతలు అప్పగిస్తా 
అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలపై ప్రజలకు అండగా ఉండాలి అంటూ చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు.

గతంలో అభివృద్ధి, రాష్ట్ర అభ్యున్నతికి ముఖ్య ప్రాధాన్యతనిచ్చానని, ఆ సమయంలో పార్టీని కాస్త నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమేనని చంద్రబాబు అంగీకరించారు. భవిష్యత్తులో అలాంటి తప్పు జరగబోదని హామీ ఇస్తున్నానంటూ స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో అవసరాల మేరకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తామని, అందరం కలిసి మళ్లీ అధికారంలోకి వచ్చేలా పరిశ్రమిద్దాం అంటూ కర్తవ్యం నూరిపోశారు.

రాష్ట్రంలో ఉచిత విద్యుత్-నగదు బదిలీ అంశంపై ఆయన స్పందించారు. అనేక పోరాటాల తర్వాత రైతులు మీటర్లు లేని ఉచిత విద్యుత్ ను సాధించారని వెల్లడించారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పు కోసం రైతు బతుకుల్ని తాకట్టు పెట్టేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలతో వైసీపీ సర్కారు అప్రదిప్ఠపాలైందని అన్నారు.
Chandrababu
Telugudesam
Ananthapur
Lok Sabha
Party
Cadre

More Telugu News