Revanth Reddy: కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy writes to Rajnath Singh to reopen roads in Cantonment area
  • సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ల మూసివేత
  • తన నియోజకవర్గ ప్రజలు ఇబ్బందిపడుతున్నారన్న రేవంత్ రెడ్డి
  • గతంలో వచ్చిన ఆదేశాల ప్రతులను లేఖకు జోడించిన ఎంపీ
మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన నియోజకవర్గ పరిస్థితులపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఆర్మీ వర్గాల ప్రాబల్యం ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో సాధారణ పౌరులు వెళ్లేందుకు వీల్లేకుండా రోడ్లు మూసేశారని ఫిర్యాదు చేశారు. ఈ విధంగా దాదాపు 20 రోడ్లను మూసేశారని ఆరోపించారు.

దీని వల్ల తన నియోజకవర్గ ప్రజలు సుమారు 10 లక్షల మంది ఎంతో అసౌకర్యానికి గురవుతున్నారని, దయచేసి రోడ్లు తెరిపించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్థానిక మిలిటరీ అధికారులను ఆదేశించాలని కోరారు. అంతేకాదు, ఆ రోడ్లను తెరవాలంటూ గతంలో కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల ప్రతులను కూడా రేవంత్ రెడ్డి తన లేఖకు జతచేశారు.
Revanth Reddy
Rajnath Singh
Roads
Cantonment Area
Secunderabad
Malkajgiri
Congress

More Telugu News