Sourav Ganguly: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. నేడు షెడ్యూల్ విడుదల!

Sourav Ganguly declares IPL 2020 schedule will be released on Friday
  • ఇప్పటికే ఆలస్యమైన షెడ్యూల్ విడుదల
  • బీసీసీఐ బృందంలో మరొకరికి కరోనా
  • ఆటగాళ్లతో అవసరం ఉన్న వ్యక్తులు మాత్రమే ఉండాలన్న నెస్ వాడియా
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూలు నేడు విడుదల కానుంది. బీసీసీఐ చీఫ్ గంగూలీ ఈ విషయాన్ని వెల్లడించాడు. షెడ్యూలు విడుదల ఆలస్యమైన మాట నిజమేనని, నేడు విడుదల చేస్తామని దాదా పేర్కొన్నాడు. అయితే, పూర్తిస్థాయి షెడ్యూలు విడుదల చేస్తారా? లేక భాగాలుగానా? అన్న విషయం తెలియరాలేదు. కాగా, ఐపీఎల్ జట్ల సభ్యులు ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని 13 మంది ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. అయితే, ఆ తర్వాత వారిలో ఒకరిద్దరు మినహా కోలుకున్నారు.

తాజాగా, బీసీసీఐ బృందంలోని ఓ వ్యక్తికి కరోనా సోకినట్టు బీసీసీఐ తెలిపింది. అతడు జాతీయ జట్టు సహాయ సిబ్బందిలో ఒకడని, సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్ల కోసం అతడు వచ్చాడని తెలిపింది. ఆటగాళ్లు కరోనా బారినపడుతుండడంతో ఆటగాళ్లతో అవసరం ఉన్న వ్యక్తులు మాత్రమే ఐపీఎల్ బబుల్‌లో ఉండాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని నెస్ వాడియా సూచించారు.
Sourav Ganguly
BCCI
Schedule
IPL 2020

More Telugu News