Bandi Sanjay: రోడ్డు ప్రమాదంలో గాయపడిన జంటను కారులో ఆసుపత్రికి పంపించిన తెలంగాణ బీజేపీ చీఫ్

Telangana BJP Chief Bandi Sanjay helps a couple who injured on road
  • హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వెళుతున్న జంట
  • గాయాలతో రోడ్డుపై దీనస్థితిలో జంట
  • అదే మార్గంలో వెళుతున్న బండి సంజయ్ కాన్వాయ్
  • స్థానిక నేత కారులో వారిని ఆసుపత్రికి తరలింపు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ మానవతా దృక్పథం ప్రదర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన జంటకు సాయం అందించారు. పున్నం రమేశ్, రమ దంపతులు తమ కుమారుడితో కలిసి హుజూరాబాద్ నుంచి కరీంనగర్ కు బైక్ పై వెళుతుండగా, మానకొండూర్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో రమేశ్, రమ గాయాలపాలయ్యారు.

ఆ సమయంలో బండి సంజయ్ ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పర్యటన కోసం ఆ మార్గంలో వెళుతున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆ జంటకు సాయం అందించే వాళ్లు ఎవరూ లేక దయనీయస్థితిలో ఉండడాన్ని సంజయ్ గుర్తించారు. వారి పరిస్థితి పట్ల వెంటనే స్పందించిన ఆయన స్థానిక బీజేపీ నేతకు చెందిన కారులో వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కూడా వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు.
Bandi Sanjay
Humanity
Couple
Injury
Road Accident
Telangana

More Telugu News