Ayyanna Patrudu: గుంటూరుని గుండూరు అనే మీ గన్నేరుపప్పుకి తెలుగు నేర్పించి లైవ్ లో కూర్చోబెట్టు: విజయసాయికి అయ్యన్న కౌంటర్

TDP leader Ayyanna Patrudu counters Vijayasai Reddy comments
  • వ్యాసాలు రాస్తున్నావా చిట్టీ అంటూ విజయసాయి వ్యాఖ్యలు
  • తెలుగు కోసం మీరు మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉందన్న అయ్యన్న
  • దళితజాతి మీకు గుండు కొట్టడం ఖాయం అంటూ ట్వీట్
తెలుగు మాట్లాడడమే సరిగారాదు, అప్పుడే వ్యాసాలు రాస్తున్నావా చిట్టీ అంటూ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చేసిన వ్యంగ్యభరిత వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. వివేకా చనిపోతే సంభ్రమాశ్చర్యాలకు గురయ్యానన్న నువ్వు తెలుగు కోసం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అంటూ విజయసాయిపై ధ్వజమెత్తారు. గుంటూరుని గుండూరు అనే మీ గన్నేరుపప్పుకి తెలుగు నేర్పించి లైవ్ లో కూర్చోబెట్టు అంటూ సెటైర్ వేశారు.

పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడికి శిరోముండనం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ అయ్యన్న మండిపడ్డారు. దళిత యువకుడ్ని పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపిన చెత్త ప్రభుత్వం మీది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి, నీకు దళిత జాతి గుండు కొట్టడం ఖాయం అంటూ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.
Ayyanna Patrudu
Vijay Sai Reddy
Language
Dalits
Andhra Pradesh

More Telugu News