Chandrababu: ఇన్నేళ్లలో ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని చూడలేదు: చంద్రబాబు

Chandrababu slams YCP government after visit Atchannaidu and Kollu Ravindra
  • విజయవాడలో అచ్చెన్న, కొల్లు రవీంద్రకు బాబు పరామర్శ
  • మంచివాళ్లు ఇబ్బందిపడుతున్నారని వ్యాఖ్యలు
  • అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టీకరణ

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ విజయవాడ వచ్చారు. బెయిల్ పై బయటికి వచ్చిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇన్నేళ్లలో ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని చూడలేదని విమర్శించారు. ఒక దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మంచివాళ్లు ఎలా ఇబ్బంది పడతారో ఇప్పుడు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు అనారోగ్యంతో బాధపడుతున్నా అరెస్ట్ చేసి కరోనా రావడానికి కారకులయ్యారని మండిపడ్డారు. అచ్చెన్న విషయంలో సాక్ష్యాలు లేవని ఏసీబీ చేతులెత్తేసిందని అన్నారు.  పీఏకి ఎవరో ఫోన్ చేశారని కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా ఎవరం భయపడం అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News