Pawan Kalyan: చేతికి కడియం.. వేళ్లకు ఉంగరాలతో పవన్ కల్యాణ్‌.. 'క్రిష్-పవన్' సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ విడుదల

Dir krish PawanKalyan and director Krish collaborate for a newTelugu film
  • వరుసగా సినిమాల్లో నటిస్తోన్న పవర్ స్టార్ 
  • క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మాణంలో కొత్త సినిమా
  • అధికారికంగా ప్రకటించిన సినిమా యూనిట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా సినిమా షూటింగులతో బిజీగా ఉండనున్నారు. ప్రస్తుతం ఆయన 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా మోషన్ పోస్టర్‌ను కూడా ఈ రోజు విడుదల చేశారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా మరో సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ కూడా వచ్చింది.
                  
క్రిష్ దర్శకత్వంలో తన 27వ సినిమాలో పవన్ నటిస్తున్నారు. ఈ సినిమాలోంచి చేతికి కడియం, వేళ్లకు ఉంగరాలు పెట్టుకుని ఉన్న ఆయన ప్రీ‌ లుక్ మోషన్‌ పోస్టర్‌‌ను విడుదల చేశారు. క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మాతగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని అధికారికంగా ప్రకటించారు.

'పవన్ కల్యాణ్ గారితో #PSPK27 పదిహేను రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది.. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది.. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం.. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ హ్యాపీ బర్త్‌ డే పవన్ కల్యాణ్' అని క్రిష్ ట్వీట్ చేశారు.
Pawan Kalyan
krish
Tollywood

More Telugu News