Chiranjeevi: తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే: పవన్ గురించి చిరు ఆసక్తికర వ్యాఖ్యలు

chiranjeevi wishes to pawan
  • మార్గాలు  వేరైనా గమ్యం ఒక్కటే
  • తన గుండెచప్పుడు ఎప్పుడూ జనమే
  • తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే
  • జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. 'తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే.. మార్గాలు  వేరైనా గమ్యం ఒక్కటే. తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే. తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కల్యాణ్ బాబు హ్యాపీ బర్త్ డే' అని చిరంజీవి ట్వీట్ చేశారు.

కాగా, పవన్ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Chiranjeevi
Pawan Kalyan
Tollywood

More Telugu News