Pawan Kalyan: పవర్ స్టార్ బర్త్ డే వేడుకలు.. విద్యుత్ షాక్ తో ముగ్గురి మృతి

Three Pawan Fans Died whth Currenct Shock
  • ప్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్
  • తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్
జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకలకు ఏర్పాట్లు చేస్తుండగా, పెను విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్లగట్టలో కొందరు ఫ్యాన్స్ పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలింది. దీంతో ముగ్గురు అభిమానులు అక్కడికక్కడే మరణించారు.

మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని సోమశేఖర్‌, అరుణాచలం, రాజేంద్రగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసును నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ముగ్గురు జనసేన సైనికులు మరణించడం తన హృదయాన్ని కలచివేసిందని, వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Pawan Kalyan
Fans
Flexies
Chittoor District

More Telugu News