Mathangi Narsaiah: కరోనాతో మాజీ మంత్రి మాతంగి నర్సయ్య మృతి!

Former minister Mathangi Narsaiah dies with corona
  • ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నర్సయ్య మృతి
  • 15 రోజుల క్రితం కరోనాతో ఆయన భార్య మరణం
  • టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన నర్సయ్య
కరోనా మహమ్మారితో తెలంగాణకు చెందిన మాజీ మంత్రి మాతంగి నర్సయ్య మృతి చెందారు. హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గత 20 రోజులుగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనాకు తోడు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తోడవడంతో ఆయన ఆరోగ్యం విషమించింది. మరో విషాదకర విషయం ఏమిటంటే... ఆయన భార్య బోజమ్మ కూడా 15 రోజుల క్రితం కరోనా కారణంగా చనిపోయారు. రెండు వారాల వ్యవధిలోనే దంపతులిద్దరూ కన్నుమూయడంతో... వారి ఇంట విషాదం నెలకొంది. నర్సయ్య మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాతంగి నర్సయ్య మంత్రిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత నెల 8న మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత నంది ఎల్లయ్య కూడా కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.
Mathangi Narsaiah
Congress
Corona Virus
Dead

More Telugu News