ఏపీలో 4 వేలు దాటిన కరోనా మరణాలు

  • గత 24 గంటల్లో 84 మంది మృతి
  • 10 వేలకు పైగా కొత్త కేసులు
  • తాజాగా 9,350 మందికి కరోనా నయం
రాష్ట్రంలో కరోనా విశృంఖలంగా వ్యాపిస్తోంది. అదే సమయంలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా 84 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,053కి పెరిగింది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 14 మంది కన్నుమూశారు. ఇక, గడచిన 24 గంటల్లో 10,368 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాల్లో భారీగా కొత్త కేసులు వచ్చాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,45,139కి చేరింది. తాజాగా 9,350 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 1,01,210 మంది చికిత్స పొందుతున్నారు.

Corona Virus
Deaths
Andhra Pradesh
Positive Cases
COVID-19

More Telugu News