Sushant Singh Rajput: సుశాంత్ ను హత్య చేసినట్టు ఇంకా ఆధారాలు దొరకలేదు: సీబీఐ అధికారి

So far no evidences of murder found in Sushants case says CBI official
  • కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన సీబీఐ
  • ఇప్పటికే పలువురిని విచారించిన అధికారులు
  • త్వరలోనే ఫోరెన్సిక్ రిపోర్టును పరిశీలించనున్న వైనం
సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో సీబీఐ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురిని విచారించింది. విచారణకు వచ్చినవారి స్టేట్మెంట్లను రికార్డు చేస్తోంది. కేసు దర్యాప్తుకు సంబంధించి విచారణ బృందంలోని ఓ సీబీఐ అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ ను హత్య చేసినట్టు ఇంత వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన అన్నారు. కేసు విచారణ కొనసాగుతోందని చెప్పారు.

సుశాంత్ ను హత్య చేశారంటూ పలువురు ఆరోపణలు చేసిన నేపథ్యంలో, హత్యా కోణంలో ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన రిపోర్టును కూడా త్వరలోనే పరిశీలించనుంది. ఇప్పటికే సుశాంత్ చనిపోయిన ప్రదేశంలో సీబీఐ అధికారులు సీన్ ను రీకనస్ట్రక్ట్  చేసిన సంగతి తెలిసిందే.
Sushant Singh Rajput
Case
CBI

More Telugu News