Vijayasai Reddy: "బాబు... మీకు సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు" అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యం

Once again satirical tweet from Vijayasaireddy
  • వెన్నుపోటుతో అధికారం లాక్కొన్నారంటూ వ్యాఖ్యలు
  • వ్యవస్థల్ని భ్రష్టుపట్టించారని విమర్శలు
  • వేరే రాష్ట్రంలో విశ్రాంత జీవితం గడుపుతున్నారని ఎద్దేవా
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో మరోసారి తనదైన శైలిలో స్పందించారు. బాబు... వెన్నుపోటుతో అధికారం లాక్కొని, ప్రజల సమ్మతం లేని పీఠంలో కూర్చున్నారంటూ ట్వీట్ చేశారు. వ్యవస్థల్ని భ్రష్టుపట్టించడమే కాకుండా, మరికొన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, డర్టీయస్ట్ రాజకీయనేతగా గుర్తింపుతెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. చివరికి రాష్ట్ర ప్రజల చీత్కారానికి గురై వేరే రాష్ట్రంలో విశ్రాంత జీవితం గడుపుతున్న మీకు సిల్వర్ జూబ్లీ విషెస్ అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు.
Vijayasai Reddy
Tweet
Satire
YSRCP
Andhra Pradesh

More Telugu News