భార్య వదిలేసిన స్టార్ హీరోతో నేను డేటింగ్ చేశా: కంగనా
- బాలీవుడ్ లో 99 శాతం మంది డ్రగ్స్ వాడతారు
- విచారణ జరిపితే ఎంతో మంది స్టార్లు జైళ్లలో ఉంటారు
- ఓ దర్శకుడు నాకు డ్రగ్స్ రుచి చూపించాడు
బాలీవుడ్ లో 99 శాతం మంది డ్రగ్స్ వాడతారని కంగన బాంబు పేల్చింది. తనకు గురువుగా చెప్పుకునే ఒక దర్శకుడే తనకు డ్రగ్స్ ను రుచి చూపించాడని తెలిపింది. కంగనా వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మరోవైపు, డ్రగ్స్ కోణంలో హీరోయిన్ రియా చక్రవర్తిని విచారిస్తున్న సంగతి తెలిసిందే.