VidyullekhaRaman: హాస్యనటి విద్యుల్లేఖ రామన్ నిశ్చితార్థం.. ఫొటోలు ఇవిగో!

Actress VidyullekhaRaman gets engaged to Sanjay
  • త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న హాస్యనటి
  • ఫిట్‌నెస్ నిపుణుడు సంజయ్‌తో చెన్నైలో నిశ్చితార్థం
  • కాస్త నాజూగ్గా మారిన విద్యుల్లేఖ
తనకు ఓ అబ్బాయితో నిశ్చితార్థం జరిగిందని తెలుపుతూ హాస్యనటి విద్యుల్లేఖా రామన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పలు ఫొటోలు పోస్ట్ చేసింది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలిపింది. తాజాగా చెన్నైలో ఆమె నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. ఫిట్‌నెస్ నిపుణుడు సంజయ్‌తో ఆమె కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులను ఒప్పించి వారు పెళ్లికి సిద్ధమయ్యారు.
                      
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ  లేడీ కమెడియన్‌గా విద్యుల్లేఖ రామన్ మంచి పేరు తెచ్చుకుంది. బొద్దుగా ఉండే ఈ భామ వ్యాయామం చేసి ఈ మధ్య సన్నగా అయిపోయింది. ఇప్పటి ఫొటోలను పోస్ట్ చేస్తూ స్వయంగా ఈ విషయాన్ని ఆమె ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తాను 68.2 కిలోల బరువు మాత్రమే ఉన్నానని ఆమె జూన్‌లో తెలిపింది. వ్యాయామం, జీవన శైలి మార్చుకోవడం వల్లే తాను బరువు తగ్గానని ఆమె చెప్పింది. నిశ్చితార్థం సందర్భంగా తీసుకున్న ఫొటోల్లోనూ ఆమె కాస్త సన్నగా కనపడింది.
            
VidyullekhaRaman
engagement
marriage
Tollywood

More Telugu News