PMO: ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’కు 7.5 లక్షల డిస్‌లైక్‌లు.. కాంగ్రెస్ హస్తం ఉందని ఆరోపణ

8 lakh dislikes to modi mann ki baat
  • ఆదివారం నాటి మన్‌ కీ బాత్‌కు 7.5 లక్షల డిస్‌లైక్‌లు
  • పీఎంవో యూట్యూబ్ చానల్‌లోనూ డిస్‌లైకుల మోత
  • 98 శాతం విదేశాల నుంచే వచ్చాయన్న బీజేపీ
ప్రధాని నరేంద్రమోదీ ‘మన్‌ కీ బాత్’కు గతంలో ఎన్నడూ లేనంతగా డిస్‌లైక్‌లు వచ్చాయి. లైకుల కంటే డిస్‌లైక్‌లు ఆరింతలు ఎక్కువ కావడం గమనార్హం. బీజేపీ యూట్యూబ్ చానల్‌లో మోదీ ‘మన్‌ కీ బాత్’కు నిన్న రాత్రి వరకు మొత్తం 1.2 లక్షల లైకులు రాగా, డిస్‌లైకులు మాత్రం 7.5 లక్షలు దాటిపోవడం గమనార్హం.

అలాగే, 30 లక్షల మంది ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. ప్రధానమంత్రి యూట్యూబ్ చానల్‌లోనూ ఈ కార్యక్రమానికి డిస్‌లైక్‌లు హోరెత్తాయి. ఇక్కడ 50 వేలకు పైగా లైక్స్ రాగా, 1.26 లక్షల డిస్‌లైకులు వచ్చాయి. డిస్‌లైకులపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. డిస్‌లైకు‌ల్లో 98 శాతం విదేశాల నుంచే వచ్చాయని, వీటి వెనక కాంగ్రెస్ పాత్ర ఉందని ఆరోపించింది.
PMO
Narendra Modi
Mann Ki Baat
Youtube
Dislikes

More Telugu News