తెలంగాణలో రేపటి నుంచి ఆన్ లైన్ క్లాసులు... టైమ్ టేబుల్ ఇదిగో!

  • 3వ తరగతి నుంచి ఇంటర్ వరకు క్లాసులు
  • ఉదయం 10.30 గంటలకు క్లాసులు ప్రారంభం
  • అరగంటకు మించకుండా ఒక్కో క్లాసు
కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రైవేట్ స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆన్ లైన్ క్లాసులకు సన్నద్ధమైంది. రేపటి నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. 3వ తరగతి నుంచి ఇంటర్ వరకు దూరదర్శన్, టీశాట్ ద్వారా డిజిటల్ తరగతులను నిర్వహించనున్నారు.

3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్లాసులను నిర్వహించనున్నారు. ఒక్కో క్లాసు సమయం గరిష్ఠంగా అరగంట ఉంటుంది. ఇంటర్ విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులను నిర్వహించనున్నారు. విద్యార్థులందరూ క్లాసులను ఉపయోగించుకునేలా చూసే బాధ్యత టీచర్లదేనని చెప్పారు.

Telangana
Online Classes
Digital Classes
Govt Schools

More Telugu News